Type Here to Get Search Results !

మంచి స్నేహితుడా మంచి కాపరివి - Manchi Snehithudaa - Praise and Worship Songs Lyrics

మంచి స్నేహితుడా మంచి కాపరివి - Srinu - Praise and Worship Songs Lyrics

Singer Srinu

మంచి స్నేహితుడా మంచి కాపరివి (2)
అగాధ జలములలో నేను నడచినను
అరణ్య యానములో నేను తిరిగినను
నన్ను ఆదరించినావు ఓదార్చినావు
చేర దీసినావు కాపాడినావు (2)
నీకే ఆరాధన – నీకే ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2)

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు
ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2)
ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు
ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన||

చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు
బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2)
నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు
నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు ||ఆరాధన||

ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి
ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2)
నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2) ||ఆరాధన||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area