Type Here to Get Search Results !

కలువరి సిలువ సిలువలో విలువ - Kaluvari Siluva Siluvalo Viluva - Telugu Christian Song Lyrics

కలువరి సిలువ సిలువలో విలువ - M M Srilekha Chrisitan Song Lyrics

Singer M M Srilekha
Music J.K. Christopher

కలువరి సిలువ సిలువలో విలువ
నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area