Type Here to Get Search Results !

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా - Enno Enno Melulu Chesaavayyaa - Telugu Worship Song Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా - Telugu Worship Song Lyrics

Singer Unknown

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area