అవధులే లేనిది దివ్యమైన నీ కృప - Hosanna Ministries Song Lyrics
అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే||
ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే||
సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే||
లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||