Type Here to Get Search Results !

ఆరాధనా నీకే ఆరాధనా - Aaraadhanaa Neeke Aaraadhanaa - Praise and Worship Songs Lyrics

ఆరాధనా నీకే ఆరాధనా - Samarpan - Praise and Worship Songs Lyrics

Singer Samarpan

ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా (2)
నా కష్టాలలో ఆరాధన
శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా||

ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||

రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area