ఆరాధన నీకే – ఆరాధన నీకే - Shalom Benhar - Praise and Worship Songs Lyrics
Singer | Shalom Benhar |
పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే – ఆరాధన నీకే
ఆరాధన నీకే (2)
నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము నా సర్వము నీవే
నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన||
నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||