అమూల్యమైన ఆణిముత్యమా - SHARON PHILIP Lyrics
Singer | SHARON PHILIP |
Singer | SHARON PHILIP |
Music | J.K. Christopher |
Song Writer | Rev. Rachel Jyothi Komanapalli |
అమూల్యమైన ఆణిముత్యమా – యెహోవ దేవుని హస్త కృతమా |2|
అపురూప సౌందర్యరాశివి నీవు – ఆత్మీయ సుగుణశీలివి నీవు |2|
|అమూల్య|
1. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు – కృపగల ఉపదేశమును చేయుదువు
యింటివారిని బాగుగ నడుపుచు – వారి మన్ననలను పొందుచుందువు |2|
|అమూల్య|
2. చేతులతో బలముగా పనిచేయుదువు – బలమును ఘనతను ధరించుకొందువు
రాత్రివేళ నీ దీపము ఆరదు – కాంతి కిరణమై మాదిరి చుపుదువు |2|
|అమూల్య|
3. దీనులకు నీ చేతులు పంచును – దరిద్రులను నీవు ఆదుకొందువు
దూరమునుండి ఆహారము కొనుచు – మంచి భోజనముతో తృప్తి పరచుదువు |2|
|అమూల్య|