శరణుకోరియుంటిని - Harini| Good Friday Telugu Christian song Lyrics
Singer | Harini |
Music | Vinay Kumar |
Song Writer | John Kennedy |
పల్లవి:
శరణుకోరియుంటిని
నీ సిలువను
నీ చరణములే
చేరియుంటిని
శరణుకోరియుంటిని
నీ సిలువను
"నీ త్యాగమును
వివరించుటకు" "2"
ఏ పదములు చాలవు
నా యేసయ్యా
" శరణుకోరియుంటిని "
చరణం1.
వధకు తేబడిన
గొర్రెపిల్లవోలే
దీనుడవై సిలువకు
అప్పగించుకొంటివి "2"
విసర్జింపబడితివి
తృణీకరించబడితివి "2"
పాపులకై ప్రాణమును
అర్పించితివయ్యా "2"
" శరణుకోరియుంటిని "
చరణం2.
పాపభారమంతా
సిలువలో మోసితివి
రోగములన్నిటినీ
నీవే భరియించితివి "2"
వ్యాధినొందినవానిగ
వ్యసనాక్రాంతునిగా "2"
కనిపించినావయ్య
ఆ సిలువలో "2"
" శరణుకోరియుంటిని "
చరణం3.
బాధింపబడినను
నోరు తెరువలేదు
దౌర్జన్యము నొందినను
ఎదురు తిరుగలేదు "2"
శత్రువులను సిలువలో
క్షమించినావు నీవు "2"
తిరుగుబాటుదారులకై
విజ్ఞాపన చేసితివి "2"
" శరణుకోరియుంటిని "
* * * * * * * * **