సిలువపై ఎగసి చిమ్మిన రక్తం - Nissy John | Good Friday Songs Lyrics 2022
Singer | Nissy John |
Tune | Padaala Suresh Babu |
Song Writer | Jami Chanti Babu |
పల్లవి:
సిలువపై ఎగసి చిమ్మిన రక్తం
మానవాళి పాపాలకై చిందించిన రుధిరం
ప్రాణాలను ప్రాయంగా విడిచిన నా యేసయ్య
నా పాప పరిహార్ద్రమై బలియైనావా ||2 సార్లు || సిలువపై||
చరణం1.
నీ త్యాగమే నీ సమర్పణేయే
సంపూర్ణ శుద్ధునిగా నను మలిచేను
నీ మౌనమే నీ ప్రేమయే
నా దోషములను క్షమియించెను ||2 సార్లు ||
విధేయతయే నీ మార్గమే
పాప విమోచనే నీ సిలువ శ్రమయే || సిలువపై||
చరణం2
నీ రక్తమే బలియర్పణయై
నా రుగ్మతలను తొలగించెను
నీ ప్రాణమే ప్రాణార్పణయై
దురాత్మలను సహితం మార్చెను ||2 సార్లు ||
విధేయతయే నీ మార్గమే
పాప విమోచనే నీ సిలువ శ్రమయే || సిలువపై||