సిలువలో నా కొరకు వ్రేలాడిన యేసయ్యా - Anjana Swamya Latest Telugu Christian Song Lyrics 2022
Singer | Anjana Swamya |
Singer | John Kennedy Bethapudi |
Music | KJW Prem |
Song Writer | John Kennedy Bethapudi |
పల్లవి:
సిలువలో నా కొరకు
వ్రేలాడిన యేసయ్యా
పరిశుద్ధ రక్తమును
చిందించినావయ్యా "2"
ఏల ఈ ఘోర శ్రమ
ఘనదైవమా నీకు
పాపిని రక్షించుటకు
బలియైతివా(నీవు) "2"
చరణం1.
నా పాపయోచనలు
ముండ్ల మకుటమాయెను
నే చేసిన దోషములు
చేతులలో సీలలాయె "2"
నా చెడు నడతలు
ప్రక్కలో బల్లెమాయె "2"
నేనే ప్రభు నిన్ను
సిలువకప్పగించినది "2"
" సిలువలో నా కొరకు "
చరణం2.
నా పాపభారమంత
సిలువలో మోసితివి
వ్యాధి బాధలన్నియు
నీవే భరియించితివి "2"
సురూపివి నీవయ్యా
కురూపిగా మారితివి "2"
ఏమని(నేనేమని) వర్ణింతును
నీ త్యాగ నిరతిని "2"
" సిలువలో నా కొరకు "
చరణం3.
నీ సిలువను చూడగనే
మనసు నీరై కరిగెను
నా హృదయం ఎంతో
వేదనతో నిండెను "2"
ఈ లోకమును వీడి
నిను వెంబడింతునయ్య "2"
క్షమియించి నీ సాక్షిగ
స్థిరపరచుము యేసయ్యా "2"
" సిలువలో నా కొరకు "