Type Here to Get Search Results !

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో - Andhaala Tara Arudenche Naakai - Christmas Song Lyrics

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో - Kalpana Christmas Song Lyrics

Singer Kalpana
Song Writer ఆచార్య ఏ. బి. మాసీలామణి గారు

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు ||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ||అందాల తార||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area