శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా | Saaswathamaina Prematho nanu - Bro. Anil| Telugu Worship Songs Lyrics
Singer | Bro. Anil |
Tune | Bro. Anil |
Music | Unknown |
Song Writer | Bro. Anil |
పల్లవి:
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీప్రేమె నను గెల్చెను …
విడువక నీకృప నాయెడ కురిపించినావయ్యా – నీకృపయె నను మార్చెను ..
నీ ప్రేమ ఉన్నతమ్.. నీప్రేమ అమృతమ్.. నీప్రేమ తేనె కంటే మధురము…
నీప్రేమ లోతులో.. నను నడుపు యేసయ్యా.. నీప్రేమ లోతులో వేరుపారి నీకై జీవించెద!
ప్రేమతో.. ప్రేమతో.. యేసయ్యా నిను వెంబడింతును!
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో..యేసయ్యా నిను ఆరాధింతును /శాశ్వతమైన /
చరణం1.
నాతల్లి గర్భమునందు నేపిండమునై యుండంగ సృష్టించి నిర్మించిన ప్రేమ ..
నాదినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే – గ్రంధములో లిఖియించిన ప్రేమ!
నా ఎముకలను నాయవయవములను – ఇంతగా ఎదిగించి రూపించిన ప్రేమ..
తల్లిఒడిలో నేను పాలుత్రాగు చున్నప్పుడు – నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సోంత పోలిక రూపులోన నను పుట్టించిన ప్రేమ..
ప్రేమతో .. ప్రేమతో .. నీకోసం నను సృజియించావయ్యా
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో ..నను మురిపెంగా లాలించావయ్యా /శాశ్వతమైన /
చరణం2.
నే ప్రభువును ఎరుగక ఉండి – అజ్ఞానములో వున్నపుడు – నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి – స్మరణే నాలో లేనపుడు – నాకోసం వేచిచూచిన ప్రేమ
బాల్యదినములనుండి నను సంరక్షించి – కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో ననుకలిసి – సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో .. ప్రేమతో .. యేసయ్యా నను రక్షించావయా ..
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో ..నను ప్రత్యేకపరిచావేసయ్యా /శాశ్వతమైన /
చరణం3.
నే పాపిపై యుండగానే నాకై మరణించిన ప్రేమ – నను సోత్తుగ చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకు తన ప్రాణపు వేలచెల్లించి – నావిలువను పెంచేసిన ప్రేమ
లోకమే ననుగూర్చి చులకన చేసినను – తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ..
ఎవరూ లేకున్నా – నేను నీకు సరిపోనా – నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నాముద్దు బిడ్డ నీవంటు నన్ను తెగ ముద్దాడిన ప్రేమ!
యేసయ్యా.. యేసయ్యా .. నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా ..
యేసయ్యా.. యేసయ్యా ..నను నీలా మార్చేందులకేనాయా /శాశ్వతమైన /
చరణం4.
పలుమార్లు నేపడినపుడు బహుచిక్కులలో నున్నపుడు – కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ – నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నాతప్పటడుగులను తప్పకుండ సరిచేసి – తప్పులను మాన్పించి స్థిరపరచి ప్రేమ..
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా – షరతులే లేనట్టి నాతండ్రి ప్రేమ..
తనకిష్టమైన తన మహిమ పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో .. ప్రేమతో .. నను మరలా సమకూర్చావేసయ్యా ..
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో .. నీసాక్ష్యంగా నిలబెట్టావయ్యా.. /శాశ్వతమైన /
చరణం5.
కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన – నాతోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానుల్లో, ఎడతెగని పోరాటంలో – తనమాటున సేదదీర్చిన ప్రేమ
లోకమే మారినను, మనుషులే మరచినను – మరువనే మరువదుగా నాయేసుని ప్రేమ
తల్లిలా ప్రేమించి, తండ్రిలా బొంధించి – ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ..
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యతగల ప్రేమ!
ప్రేమతో .. ప్రేమతో .. నా విశ్వాసం కాపాడావయ్యా..
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో … బంగారంలా మెరిపించావయా… /శాశ్వతమైన /
చరణం6.
వూహించలేనటువంటి కృపలను నాపై కురిపించి – నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని – అందలములు ఎక్కించిన ప్రేమ
పక్షిరాజు రెక్కలపై నిత్యమూ నను మోస్తూ – శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ ..
పర్వతాలపై ఎపుడు క్రీస్తువార్త చాటించే – శిఖరపు భాగములు నాకిచ్చిన ప్రేమ ..
తన రాయబారిగా నన్నువుంచిన యేసే ఈప్రేమ!
ప్రేమతో .. ప్రేమతో .. శాశ్వతజీవం నాకిచ్చావయా
ప్రేమతో (ప్రేమతో) ప్రేమతో …నను చిరకాలం ప్రేమిస్తావయా.. /శాశ్వతమైన /