ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి | Prabhuva Nee Karyamulu - Sharonphilip,Lillianchristopher, Hanajoyce Lyrics

Singer | Sharonphilip,Lillianchristopher, Hanajoyce |
Composer | Lillianchristopher |
Music | Jk Christopher |
Song Writer | Lillianchristopher |
పల్లవి:
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2సార్లు)
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2సార్లు)
చరణం1.
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2సార్లు)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
...సన్నుతించెదనూ...(2సార్లు)
చరణం2.
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2సార్లు)
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
...సన్నుతించెదనూ...(2సార్లు)
చరణం3.
ఏ యోగ్యతలేకున్నా - నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో - సాధనముగా మలచితివి (2సార్లు)
నా ధైర్యము నీవేగా - నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
..సన్నుతించెదనూ...(2సార్లు)