Type Here to Get Search Results !

పరాక్రమముగల బలాఢ్యుడా | Paraakramamu Gala Balaadhyudaa | | Bro Anil kumar songs

పరాక్రమముగల బలాఢ్యుడా | Bro Anil kumar songs | Christian Song Lyrics

Singer Bro. Anil Kumar
Singer Bro. Anil Kumar
Music Bro. Anil Kumar
Song Writer Bro. Anil Kumar

పల్లవి:
పరాక్రమముగల బలాఢ్యుడా – నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…. భయపడకు….
హే దహించు ఆగ్నయన నీ దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు?
నీకంటే బలమైన ఆజనములు నీముందు నిలవలేరు పద ముందుకు !
ఇక చేసుకొ స్వాధీనం! స్వాధీనం …. ఓ .. స్వాధీనం …. ఓ .. స్వాధీనం ….
take take take-over – take take take-over
take take take-over – take take take-over /పరా /

చరణం1:
నీవలన భయమును ప్రతి జనముకు నీ ప్రభువు పుట్టించును
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈభూమి మొత్తాన్ని నీస్వంతం చేసాడు లోబరచి ఏలేయను
అరె ఈదేశ వైశాల్యమంత నువ్వడుగేసి ప్రభు జండ స్థాపించను /ఇక/

చరణం2:
దేశపు ఉన్నత స్థలములపైన ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను ప్రభు నీచేత కట్టించును
తన రాజ్య మకుటంగా తనరాజ్య దండంగ ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను /ఇక/

చరణం3:
నీకొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతముగుండెను
నీశక్తి మించిన కార్యములను ప్రభు నీచేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక – కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు – ముందుండి నడిపించును /ఇక/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area