Type Here to Get Search Results !

మోయలేని భారమంత సిలువలో మోసావు | Moyaleni Bharamantha | Good Friday Songs Lyrics

మోయలేని భారమంత సిలువలో మోసావు| Moyaleni Bharamantha - Hema Chandra | Good Friday Songs Lyrics

Singer Hema Chandra
Composer Sayaram Gattu
Music K.Y.Ratnam
Song Writer Sayaram Gattu

పల్లవి:
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు || 2 ||
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు (2)

చరణం1.
కడలి పై నడిచిన పాదాలు! సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు! సిలువలో సీలలతో వ్రేలాడే || 2 ||
ఇంత ఘోరము, మోపిన నేరము
నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని ||

చరణం2.
జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి || 2 ||
తాకినంతనే, మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని ||

చరణం3.
దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి || 2 ||
ఇంత జరిగిన, ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area