Type Here to Get Search Results !

బంగారం అడుగలేదు | Bangaram Adugaledu

బంగారం అడుగలేదు | Bangaram Adugaledu - Raj Prakash Paul Lyrics

Singer Raj Prakash Paul
Tune Raj Prakash Paul
Music Raj Prakash Paul
Song Writer Raj Prakash Paul

పల్లవి:
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)


నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||

చరణం1:
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||

చరణం2:
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area