Arpinchu Song Lyrics | అర్పించు Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Sean Talluri |
| Vocals/Singer | Divya David & Sean Talluri |
అర్పించు నీ జీవితము, ప్రభు యేసుని సేవ కొరకు
సంపూర్ణ శాంతి పరిపూర్ణ ప్రేమ, క్రీస్తులో పొందరమ్ము
1
తన రాజ్యమందు, నిను నిలుపుట కొరకు
సర్వమును విడచి, ఇలనేతెంచె
ఆ గొప్ప కృపకై ఏమివ్వగలవు, అర్పించు నీ హృదయము
2
నీ పాపమంతా తొలగింపజేయ
పలు ఘోర శ్రమలన్, సహియించెనేసు
ఆ ప్రేమకై నీవేమివ్వగలవు, అర్పించు నీ సమయము
3
నీ నిత్య జీవం, కొరకై ఆ సిలువందు,
మరణించి మరల, లేచెను యేసు
ఆ త్యాగమునకై ఏమివ్వగలవు, అర్పించు నీ తలాంతులు
4
పరలోకమునకు నిన్ను కొనిపోవ
తిరిగి రానుండే, నీ రాజు యేసు
ఆ స్వాస్థ్యమునకై ఏమివ్వగలవు, అర్పించు ధన సంపదలు
