Emundi Nalo Yesayya Song Lyrics | ఏముంది నాలో యేసయ్య Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Ebinazar Sastry |
| Vocals/Singer | Kushi Devarapalli |
ప్రేమించే తండ్రి ఏముంది నాలో
నీ నిత్య ప్రేమకు అర్హతేలేదు నాలో (2)
నేను మరచినా నన్ను మరువలేదు
నేను విడిచినా నన్ను విడువలేదు (2)
ఏముంది నాలో యేసయ్య
ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య (2)
1. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను
క్షణమైన మోకరించలేదు (2)
అవకాశమున్నా ప్రార్థించలేదు (2)
ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు (2)
(ఏముంది నాలో)
2. పలుమార్లు నేను పడిపోయినాను
తండ్రి ప్రేమను మరిచినాను (2)
వాక్యము విన్నా మారకున్నాను (2)
భక్తి నే నటనగా మార్చుకున్నాను (2)
(ఏముంది నాలో)
