Akasame Pattanodu Song Lyrics | ఆకాశమే పట్టనోడు Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | KR John |
| Vocals/Singer | Reventh, Priya Himesh |
పల్లవి: ఆకాశమే పట్టణోడు
ధరణిలో పుట్టినాడు
దావీదు పురము నందు దీనుడై
వెలసినాడు రక్షకుడు. ( 2)
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే (2)
చరణం:1
అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు (2)
ఆది యందు వాక్యాంబుగా
సృష్టికార్యం జరిగించి నాడు.
అనాధి నుండి జ్ఞానంబుగా
సృష్టి క్రమము నడపించినాడు. (2)
అన్నింటిని కలిగించిన మహారాజు
కన్నీటినీ తుడుచుకు దిగి వచ్చినాడు. (2)
ఆనందమే మహ ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే (2)
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చి రక్షించే దేవుడు...(2)
చరణం:2
పాపము లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు.(2)
నిత్య ముండు నీతి సూర్యుడు...
సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు.
ప్రేమను పంచే పావనాత్ముడు...
పశుల పాకలో పవళించి నాడు.(2)
సర్వాధికారి అయిన మహారాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు.(2)
ఆనందమే మహ ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే (2)
"ఆకాశమే పట్టణోడు" 3:23
