Neeve Nireekshana Song Lyrics | నీవే నిరీక్షణ Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Catherine Jillella |
| Vocals/Singer | Catherine |
గాఢాంధకారములో నే సంచరించగా
అగాధ స్థలములలో పడియుండగా
నిరాశతో నే నీ వైపే చూడగా
నిస్పృహ కలిగి నిన్ను పిలువగా
అంధకారము చీల్చి నీ ప్రేమతో నా
హృదయమునే నీవు నింపావుగా
నా శూన్య జీవితమే సంపూర్ణము చేసిన
యేసుప్రభు నీవే నిరీక్షణ
ఊహించలేను ఇంతటి దయను
నిచ్చావు మాకు సమృద్ధిగా
రాజులకు రాజా నీ మహిమను వీడి
మోసితివే నా అపరాధము
ఆ సిల్వలోనే క్షమియించి నన్ను
నీ సొత్తుగానే చేశావుగా
సుందర రక్షక నేను నీ దానను
యేసయ్య నీవే నిరీక్షణ
హల్లెలూయ నన్ను విడిపించిన దేవునికే
హల్లెలూయ మరణము గెలిచిన రాజునకే
ప్రతి సంకెళ్లను తెంచితివే
రక్షణ నీ నామములోనే
యేసయ్య నీవే నిరీక్షణ
లేఖనము నెరవేర అరుణోదయమాయనే
నీ మృత శరీరము శ్వాసించెనే
నిశ్శబ్దము నుండి గర్జించే సింహం
ప్రకటించెనే మరణము పైన విజయము
లేఖనము నెరవేర అరుణోదయమాయనే
మృతమైన శరీరమే స్వాసించెనే
నిశ్శబ్దము నుండి గర్జించే సింహం
ప్రకటించెనే మరణము పైన విజయము
యేసయ్య నీదే ఆ విజయము
హల్లెలూయ నన్ను విడిపించిన దేవునికే
హల్లెలూయ మరణము గెలిచిన రాజునకే
ప్రతి సంకెళ్లను తెంచితివే
రక్షణ నీ నామములోనే
యేసయ్య నీవే నిరీక్షణ
