Siluva Mosinavuga Song Lyrics | సిలువ మోసినావుగ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Bro.prakash garu |
Vocals/Singer | Pas. George Bush Garu |
మహనీయుడా....
మహిమోన్నతుడా....
నా పాపభారమంతటినీ భరియించిన యేసు రాజా...
ఆ... ఆ... ఆ... ఆ...
సిలువ మోసినావుగ దోషినైన నాకై
కరుణ చూపినావుగ విలువలేని నాపై
గాయమొందినావుగ మనసులేని వానికై
రక్తముతో కళంకము కడిగి
మరణపు శాపము విరిచావయ్యా ||సిలువ ||
బండమీద సర్పము జాడ కానరాని రీతిగాను
చేసిన పాపపు ఆనవాలు కానకుండ తుడిచానయ్యా
ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా
ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా
||గాయమొందినావుగ||
కంటబడే వారందరిలో శుద్ధుడను అని తలచాను
గర్వముతో మరుగైన స్నేహం కానకుండ చేసానయ్య
ఎల్లవేళలా ఎదుటివారిలో లోపము వెతుకుచు బ్రతికానయ్య
వాక్యముకైనా రూపము మార్చే ఊహకందని నేర్పరినయ్యా
||గాయమొందినావుగ||
మేలులనుభవించినపుడు మంచిదేవుడని చాటాను
కీడు జరిగితే న్యాయము లేదని కానకుండ అరిచానయ్య
హృదయములో అపరాధభావం కలుగకుండ చంపానయ్య
మాటలతో వంచించటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా ||సిలువ