Naa Sthaanamu lo Niluchunnaave Song Lyrics | నా స్థానములో Song Lyrics | Telugu Good Friday Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Dr. PRATAPA RAJU MOOLA |
Vocals/Singer | LILLIAN CHRISTOPHER |
దేవుని గొర్రెవై దిగి వచ్చినావే
నా పాప భారము తొలగించుటకు
కల్వరి సిల్వ పై తలదించినావే
నా దోష శిక్షను భరియించుటకు
నా స్థానములో నిలుచున్నావే
అవమానములేనో భరింయించావే
నాకు బదులుగా మరణించావే
నిత్య జీవము నాకిచ్చావే
1.నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం
నేనే కదా నా పాపమే కదా
నా అవిధేయతతో పలు మారులు నీ గాయం
రేపితినయ్య నజరేయుడా
యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం
తెలియలేదు దేవా నీ కృప వారం
మన్నించావా... ఆ... ఆ... ఆ...
"నా స్థానములో"
2.నావంటివారేకదా నిను సిలువ వేయమని
అప్పగించిన యూదా జనము
నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో
మేకులను గ్రూచ్చినవారు
మౌనముగా అన్ని సహియించి
ప్రేమతో దొంగను కూడా క్షమియించి
బలియైతివా... ఆ... ఆ... ఆ...
"నా స్థానములో"