Jaya Sankethama Song Lyrics | జయ సంకేతమా Song Lyrics | Hosanna Ministries Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pas.JOHN WESLEY |
| Vocals/Singer | Pas.JOHN WESLEY |
జయ సంకేతమా దయాక్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్య (2)
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు (2)
నడిపించే నీ ప్రేమ పిలుపు
( జయ సంకేతమా )
చరణం :- 1
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు సర్వము సమకూర్చేనే (2)
నన్నెలా ప్రేమించ మనసాయెను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా
నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేదా నా యాజమానుడా (2)
( జయ సంకేతమా )
చరణం :- 2
నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా (2)
( జయ సంకేతమా )
చరణం :- 3
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమీది (2)
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా (2)
( జయ సంకేతమా )
