Dhanyudavo Song Lyrics | ధన్యుడవో Song Lyrics | #praveenpagadala

Details | Name |
---|---|
Lyrics Writer | Bro. Shalem Raj |
Vocals/Singer | Bro. Shalem Raj |
ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న
దయామయుని హతసాక్షిగా ఒరిగినావన్న
రాజమండ్రి సమీపాన చెందిన నీ రక్తం
రక్కసి మూకలా మార్పుకు మొరపెట్టును నిత్యం
చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను
చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను
గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం
హతసాక్షుల కవిలెలోన దక్కె నీకు స్థానం
పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో
నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం
యేసుని వార్తను చాటగా పయనం చేస్తు
(మత)ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు
మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక
క్రీస్తు సిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక
ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా
ఒక మనిషిని చంపితే వేయి మంది లేచురా
ఒక జ్యోతిని ఆర్పితే వేయి జ్యోతుల్ వెలుగు రా