Akshayuda Naa Priya Song Lyrics | అక్షయుడా నా ప్రియ Song Lyrics | Hosanna Ministries Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pas. JOHN WESLEY |
| Vocals/Singer | Pas. JOHN WESLEY |
అక్షయుడా నా ప్రియ యేసయ్యా.
నీకే నా అభివందనం (2)
నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసి పోతామని
యుగయుగములు నన్నేలు తావని
నీకే నా ఘన స్వాగతం.
( అక్షయుడా)
1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే
దొరికెనే అది అపురూపమైన
నీ దర్శనం కలిగి జీవించు నే
నేనే మందును ఆకాంక్షితును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా..
చిరకాల ఆశను నెరవేర్చు తావని
మదిలో చిరు కోరికా
(అక్షయుడా)
2. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని
మరువలేదంటివే
నీ కనుపాపగా నన్ను కాచుకొని
దాచుకుంటావులే
నన్ను రక్షించిన ప్రాణమర్పించిన
నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా పానార్పణముగా
నా జీవితమును అర్పించుకున్నానయా
(అక్షయయుడా)
3. నీవు స్థాపించిన ఏ రాజ్యమైన
కొదవ లేకుండెనే
బహు విస్తారమైన నీ కృపయే
మేలుతో నింపెనే
అది స్థిరమైనదై క్షేమము నొందనే
నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే
నా ప్రియుడా యేసయ్యా రాజ్యాల నేలే
శకపురుషుడా నీకు సాటెవ్వరు.
(అక్షయుడా)
