-->
Type Here to Get Search Results !

Arachethilone Song Lyrics | అరచేతిలోనే Song Lyrics

Arachethilone Song Lyrics | అరచేతిలోనే Song Lyrics | Telugu Christian Songs Lyrics

Arachethilone

పల్లవి:

అరచేతిలోనే చెక్కబడినా ఓ శిల్పమా..

ఈ సృష్టిలోనే ప్రధమఫలమా..

ఊహలకు అందని అపురూప నిర్మాణమా..

ఆ దేవదేవుని స్వరూపమా..

ఈ నేలమంటితో..నిర్మించినాడుగా..తన ఊపిరే నీకిచ్చాడుగా..

తన రూపమందునా..సృజియించినాడుగా..నీ కోసమే ఎదురు చూసాడుగా..

ఆ దేవుని సంకల్పమే నువ్ గుర్తించావా..?

బ్రతుకిచ్చిన ఆ దేవునే నువ్ వదిలేస్తావా..?

యోచించుమా..ఓ నేస్తమా..పని ఉందని మరువకుమా..*||2||*


చరణం 1:

గర్భమున రూపించి..దేహన్ని నిర్మించి..

సమయాన్ని నీకిచ్చి..పనియిచ్చెను..

దినములను లెక్కించి..గ్రంధములో లిఖియించి..

సత్క్రియలు జరిగింప..నియమించెను..*||2||*

పాపమే ఘోరమై..ఆశకే చేరువై..

సత్యమే భారమై..దైవమే దూరమై..

ఊపిరే వదిలితే గతి ఏమిటో..నీ..బ్రతుకునే దిద్దుకో..జీవాన్ని పొందుకో..

||అరచేతిలోనే||


చరణం 2:

చీకటికి చోటిచ్చి..దుష్క్రియలు జరిగించి..

లోకాన్ని స్నేహించి..ప్రభుమార్గమిడిచావు..

ప్రభు నిన్ను ప్రేమించి..రక్తాన్ని చిందించి..

క్రయధనముగా మారి..విడిపించెను..*||2||*

ప్రార్థనే ఊపిరై..వాక్యమే జీవమై..

రక్షణే ధ్యేయమై..ప్రేమయే ప్రాణమై..

వెలుగుము జ్యోతిగా..వెలిగించు లోకాన్నే..

క్రీస్తుకే సాక్షిగా..సాగించు జీవనం..

||అరచేతిలోనే||


**************************************************

Lyrics : Manem Prasanthi

Singer : Shruthika Samudarala

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area