Memu Bhayapadamu Song Lyrics | మేము భయపడము Song Lyrics | Telugu Hebron Songs Lyrics
మేము భయపడము ఇక - మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు
1)దైవభ్రష్టులమైన మమ్ము - దివ్యంబుగా రక్షించె
దివారాత్రులు దేవుడే కాయును || మేము ||
2)శత్రుకోటి మమ్ము జుట్టున్ - పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును || మేము ||
3)అగ్ని పరీక్షలయందు - వాగ్ధానమిచ్చె మాతోనుండ
యేఘడియైనను విడువక కాయును || మేము ||
4)బలమైన ప్రభు హస్తములు వలయమువలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము || మేము ||
5)కునుకడు మనదేవుడు, యెన్నడు నిద్రించడు
కనుపాపగ మము కాపాడునెప్పుడు || మేము ||
6)జీవిత కష్టనష్టములు - ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు || మేము ||
7)ఇహమందు మన శ్రమలన్ని - మహిమకు మార్చెడు ప్రభున్
మహిమ పరచి మ్రొక్కెదమిలలో || మేము ||
**********************************************
Singer : Sis.R.Prasanna Jyothi
producers : Sam & Suzan
Music : Bro.Chitty Prakash Dhairyam
SONGS OF ZION Vol 3