Gathakalamantha Song Lyrics | గత కాలమంతా Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి:గత కాలమంతా కాపాడినావు
నా చేయి పట్టి నడిపించినావు"2"
ఎనలేని ప్రేమకై స్తోత్రములు
యేసయ్యా నీకే కృతజ్ఞతలు"2"
1)రాకాసిఅలలు నను ముంచివేయ
అభయమిచ్చి నన్ను రక్షించితివి
బంధకాలెన్నో బాధించినవేళ
నీకృపతో విమొచించితివి
ప్రతి శ్రమలో తోడైయుంటివి
శోధనలనుండి తప్పించుచుంటివి"2"
ఏమివ్వగలను నీప్రేమకు
ఎలా తీర్చగలను నీ'రుణమును"2"
2)గాఢాందకారం నన్నావరించినా
నీతిసూర్యునివై ఉదయించితివి
గాయాలపాలై వేదనలొఉన‌్న
నీహస్తములె నన్ను స్వస్థపరిచెను"2"
కృంగినవేళలో ఆదరించితివి
కన్నీరంతయు తుడిచివేసితివి"2"
ఏమివ్వగలను నీప్రేమకు
ఎలా తీర్చగలను నీ'రుణమును"2"
***********************************************
Lyrics & Tune : John Kennedy Bethapudi,
Vocals : Anjana Sowmya,
Music : KJW Prem,