Yesu Puttenu Song Lyrics | యేసు పుట్టెను కన్య Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి:
యేసు పుట్టెను కన్య మరియకు
బెత్లెహేము ఊరి నందు
లోకానికి అరుదెంచెను
ఆ పశులశాలయందు
ప్రవచనమే నెరవేరెను
పరిస్థతులే మారిపోయెను
॥యేసు పుట్టెను॥
1, చీకటిలో ఉన్న జనులకు
గొప్ప వెలుగుదయించెను
మరణములో ఉన్న వారు
జీవములోనికి దాటెను
మనలను రక్షించుటకు
మానవునిగా భువికి దిగి వచ్చెను
॥యేసు పుట్టెను॥
2, ఆశ్చర్యకరుడుగా వచ్చెను ఆలోచనా మనకు చెప్పెను
శరీరధారియై వచ్చెను
కృపాసత్యముతొ నిండెను
బలవంతుడుగా నిత్యుడగు తండ్రిగా
సమాధానా అదిపతిగా
॥యేసు పుట్టెను॥
3, నేడే నీ మనసు మార్చుకో
నీకై వచ్చెనని తెలుసుకో
నమ్మినవారికి రక్షణ
సిద్ధము చేసెను దేవుడు
విశ్వాసముంచుము ఆ యేసునందు
నిత్యజీవము నీకొసగును
॥యేసు పుట్టెను॥
**********************************************
Vocals : Sis. Prasanna Bold
Lyrics & Tune : Sudhakar Rapaka- Bhimavaram
Music : Danuen Nissi