-->
Type Here to Get Search Results !

Pashula Pakalo Paralokanaadhudu Lyrics | పశుల పాకలో Lyrics

Top Post Ad

Pashula Pakalo Paralokanaadhudu Song Lyrics | పశుల పాకలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Pashula Pakalo Paralokanaadhudu

పల్లవి :


పశుల పాకలో పరలోక నాథుడు

అరుదెంచేనే ఇలచూడు -అవని రక్షింప నేడు

నింగిలోని దేవుడు నీకై దిగివచ్చెను చూడు

ప్రణమిల్లు క్రీస్తుకు నేడు- మనకిక ఆయనే తోడు


చరణం - 1:


రక్షింపగ ఈ లోకం -విడిచాడు పరలోకం

పరమతండ్రి ఆదేశం -కదిలాడు మనకోసం

లోక రాజై తను పుట్టాడుగా.....

దాసునిగానే ఇలజీవించాడుగా

గగన తారనే నడిచొచ్చిందిగా...

లోక జ్ఞానమే తలదించిందిగా.....

కన్యక ఒడిలో పరిశుద్ధతనయుడు-

పవళించెను చూడు -తరియింపగా నేడు


చరణం - 2:


సుందరముతనదేహం - అర్పింపగమనకోసం

విలువైనది తన ప్రాణం - జీవమునకు అది మార్గం

నూతన నిబంధనై తను వచ్చాడుగా .....

సత్యస్థాపనకై తను నిలిచాడుగా...

పరమతండ్రినే తనుతెలిపాడుగా .......

నిన్నునన్ను రక్షింప వచ్చెనుగా .......

కలువరి గిరిలో ప్రాణత్యాగమివ్వగా

రక్షకుడైవచ్చినా మన క్రీస్తుని చేరు...



Watch the Song Video

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area