Parikinchumu Na Jeevithamu Song Lyrics | పరికించుము నాజీవితము Song Lyrics | Telugu Christian Songs Lyrics
పరికించుము నాజీవితము
పనికిరానివి తొలగించుము
కనిపించునట్లు నాలోఫలము
పంపించుము ఆశీర్వాదము
1) నీలో నిలిచి నీతో నడిచి
నిను హత్తుకొని ఉండనీయుము"2"
కాలువయోరన నాటిన చెట‌్టులా"2"
పచ్చగా ఎదిగే కృపనీయుము"2"
2) నీపై ఒరిగి నీకై కరిగి
నీను అల్లుకోని ఉండనీయుము"2"
వాక్యపుసారము పొందిన కొమ్మలా " 2"
సాక్షిగా నిలిచే కృపనీయుము"2"
3) నీకే వెరచి నీచే వెలిగి
నిను అంటుకొని ఉండనీయుము"2"
జీవితపు కాంతిలో ప్రాకిన తీగలా"2"
దీవెనకలిగే కృపనీయుము "2"