Type Here to Get Search Results !

Ninne Namminanu Yesayya Song Lyrics | నిన్నే నమ్మినాను యేసయ్య Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Namminanu Yesayya Song Lyrics | నిన్నే నమ్మినాను యేసయ్య Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Namminanu Yesayya
నిన్నే నమ్మినాను యేసయ్య -నన్ను విడచి పోకు యేసయ్య
నా ప్రాణం ధ్యానం జీవం నీవే
నిన్నే చేరినాను యేసయ్య || 2 ||

1.కదలుచున్న మేఘములు -ప్రేమ జల్లు కురిపించే
ఎండిన న హృదయములో -జీవ జలములు రాలేనే
నా జీవము నీవై నాలోనే ఉండాలని || 2 ||
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని || 2 ||
మాటకొరకు చూసా యేసయ్య -మాటలాడ రావా యేసయ్య
నా మాట పాట ఊటలు నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||

2.లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం
నీవే నాకు తరగని దనము || 2 ||
నిన్నే నేను కోరుకొనుచున్నాను || 2 ||
మనసారా నిన్నే యేసయ్య -నా ప్రాణం నీవే యేసయ్య
నా బలము దనము ఘనము నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||

3.ధగధగా మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో -నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని
బంగారపు వీధులలో నీలోనే నడవాలని
పొందబోవు బహుమానం కన్నులార చూడాలని
ఆశతోనే చూసా యేసయ్య -నా ఆశలన్నీ నీవే యేసయ్య
నా ఆశ ద్యాస శ్వాస నీవే -నిన్నే కోరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area