Nee Siluva Sramalu Song Lyrics | నీ సిలువ శ్రమలు Song Lyrics | Telugu Christian Lyrics | Good Friday Songs
నీ సిలువ శ్రమలు ధ్యానించాలని
నీ సముఖములో తరించాలని
మాలిన్యమునకు దూరంగా - నీకిష్టమైన యాగంగా
జీవితం మలచుకోవాలనే పవిత్ర సాధన దీక్ష
అ.ప. : ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష
1. మానవపాపపరిహారార్థం భువికేతెంచిన నీవు
సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు
నా సిలువను నేనెత్తుకొని- నన్ను నేను తగ్గించుకొని
నీ అడుగులలో నడవాలనే పవిత్ర సాధన దీక్ష
2. లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం
గెత్సెమనెలో మోకాళ్ళపైన మ్రోగెను ప్రార్థననాదం
నా పాపక్రియలకొరకై నే పశ్చాత్తాప హృదయముతో
ఆత్మీయ వసంతం పొందాలనే పవిత్ర సాధన దీక్ష
3. పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు
ప్రేమ కలిగియుండుమని బోధించి మాదిరి చూపించినావు
శత్రువుకై ప్రార్ధించిన - అందరికి మేలు చేసిన
నీ మనసు కలిగియుండాలనే పవిత్ర సాధన దీక్ష