Nee Arachethilo Nenunnaani Song Lyrics | నీ అరచేతిలో నేనున్నాని Song Lyrics | Telugu Christian Lyrics
నీ అరచేతిలో నేనున్నాని తెలిసి
అనాధ ని మరిచిపోతినే
నీ కను చూపులో నేనున్నాని తెలిసి
కన్నీళ్ళు ఆగకున్నదే
మరణపు అంచులో మరువని దేవా - శరణపు నీడలో దాచిన దేవా
1. తోడుగా ఉన్నవారే నన్ను మోడుగా చేసేరు
అండగా ఉన్నవారే నన్ను దండగేనన్నారు
తోడుగా నీడగా నా వెంట ఉంటివే (2)
పాడైన బ్రతుకుని ఫలియింప జేస్తివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా
2. చెంతగా ఉన్నవారే నన్ను చెడుగా చూసేరు
సొంతమన్న వారే నన్ను గుంతలో తోసారు
వింతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి
దారిద్య్ర బ్రతుకునే దీవింప జేస్తివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా
3. కారణమూ నేనేగా - ఇల నమ్మడం తప్పెగా
దారుణం జరిగాక నేను మరణమే కోరగా
కొడుకా కూతురా తండ్రి నే ఉన్నానని
తన ప్రేమ కోగిలిలో కాచుకుంటివే