Needanu Poli Naa Dinamulu Song Lyrics | నీడను పోలి నా దినములు Song Lyrics

నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము
లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము
దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము
నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము
చరణం:
కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక
కరిగించేశాను లోకంలో అతి సులువుగా..
దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక
కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా.. (2)
దేహము ముడతలుగా అడుగులు తడబడగా
కన్నులు కనబడక కాటికి త్వరపడగా
ఊపిరి భారముగా అందరు దూరముగా
మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా
సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా
సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥నీడను ॥
చరణం:2
సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక
గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా..
పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక
పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..(2)
హృదయము త్వరపడగా కోరిక బలపడగా..
బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా..
వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా
నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా..
మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా ..
మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా..
పల్లవి: నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము
దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము
దేవునికొరకై జీవించడమే పరమార్ధము
మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము ॥ నీడను ॥
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము
లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము
దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము
నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము
చరణం:
కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక
కరిగించేశాను లోకంలో అతి సులువుగా..
దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక
కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా.. (2)
దేహము ముడతలుగా అడుగులు తడబడగా
కన్నులు కనబడక కాటికి త్వరపడగా
ఊపిరి భారముగా అందరు దూరముగా
మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా
సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా
సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥నీడను ॥
చరణం:2
సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక
గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా..
పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక
పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..(2)
హృదయము త్వరపడగా కోరిక బలపడగా..
బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా..
వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా
నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా..
మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా ..
మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా..
పల్లవి: నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము
దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము
దేవునికొరకై జీవించడమే పరమార్ధము
మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము ॥ నీడను ॥