Type Here to Get Search Results !

Shree Yaesu Raajyamumdunu Song lyrics | శ్రీ యేసు రాజ్యముండును Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Shree Yaesu Raajyamumdunu Song lyrics | శ్రీ యేసు రాజ్యముండును Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Shree Yaesu Raajyamumdunu Song lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును

2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును

3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు

4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్

5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్

5. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్
దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area