Asalaina Christmas Song Lyrics | అసలైన క్రిస్మస్ Song Lyrics | Christmas Songs Lyrics

అసలైన క్రిస్మస్ మన జీవితమే
ఆరాధన అంటే జీవన విధానమే
క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే
ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమే
క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే
ఏదేమైన దేవుని చిత్తం చేయడమే
మాటల్లో ఆరాధన
చేతల్లో ఆరాధన
బ్రతుకంతా ఆరాధన
అదేగా మనకు దీవెన
1. క్రిస్మస్ తారను చూడు
వెదజల్లే వెలుగును చూడు
జ్ఞానులకే మార్గము చూపిన
దేవుని జ్ఞానం చూడు
దేవుని కొసం వెలిగే తారవు నీవైతే
క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
2. పశువుల తొట్టెను చూడు
పవళించిన క్రీస్తును చూడు
ప్రజలందరిని రక్షించుటకై
దాసుని రూపము చూడు
క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే
దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
3. గొల్లలు జ్ఞానులు చూడు
శుభవార్తను నమ్మిరి చూడు
యేసును చూసే ఆశను కలిగి
ముందుకు సాగిరి చూడు
యేసుని చూసే ఆశను కలిగి జీవిస్తే
దేవుడు నిన్ను నిశ్చయముగ దర్శించునుగా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
Lyrics, Tune, Music & Vocals - Jonah Samuel
ఆరాధన అంటే జీవన విధానమే
క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే
ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమే
క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే
ఏదేమైన దేవుని చిత్తం చేయడమే
మాటల్లో ఆరాధన
చేతల్లో ఆరాధన
బ్రతుకంతా ఆరాధన
అదేగా మనకు దీవెన
1. క్రిస్మస్ తారను చూడు
వెదజల్లే వెలుగును చూడు
జ్ఞానులకే మార్గము చూపిన
దేవుని జ్ఞానం చూడు
దేవుని కొసం వెలిగే తారవు నీవైతే
క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
2. పశువుల తొట్టెను చూడు
పవళించిన క్రీస్తును చూడు
ప్రజలందరిని రక్షించుటకై
దాసుని రూపము చూడు
క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే
దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
3. గొల్లలు జ్ఞానులు చూడు
శుభవార్తను నమ్మిరి చూడు
యేసును చూసే ఆశను కలిగి
ముందుకు సాగిరి చూడు
యేసుని చూసే ఆశను కలిగి జీవిస్తే
దేవుడు నిన్ను నిశ్చయముగ దర్శించునుగా
ఇదియే ఆరాధన
నిజ క్రిస్మస్ ఆరాధన
Lyrics, Tune, Music & Vocals - Jonah Samuel