Veligindhi Kalyana Veduka Song Lyrics | వెలిగింది కల్యాణ వేదిక Song Lyrics | Telugu Christian Marriage Song
వెలిగింది కల్యాణ వేదిక
ప్రభు యేసు దీవెనలీయగా "2"
అనురాగ బంధమానందమొంద అలరించే ఈ దినం "2"
1.కుసుమాల హారం వికశించే మెడలో
పరిమళపు జల్లులో
దాంపత్య దీపం వెలగాలి నిత్యం
శ్రీకరుని కరుణతో
ఈ నాటి ఈ బంధము - నిలవాలి కలకాలము
వెలగాలి చిరకాలము...
2.హృదయాలు రెండు ముదమార కలిసే
ప్రభు ప్రేమ కాంతిలో
కలగాలి సిరులు నిండాలి ఎదలో
మెండైన వరములు
ఈనాటి ఈ బంధము నిలవాలి కలకాలము
వెలగాలి చిరకాలము...
3.సంసార లోక సంతోష యానం
సాగాలి హాయిగా
ఈనాటి మధుర భావాలు మేర
నిలవాలి సర్వదా
సంతాన సౌభాగ్యము శ్రీయేసు మీకీయగా
శుభ దీవెనలు పొందుడి...
ప్రభు యేసు దీవెనలీయగా "2"
అనురాగ బంధమానందమొంద అలరించే ఈ దినం "2"
1.కుసుమాల హారం వికశించే మెడలో
పరిమళపు జల్లులో
దాంపత్య దీపం వెలగాలి నిత్యం
శ్రీకరుని కరుణతో
ఈ నాటి ఈ బంధము - నిలవాలి కలకాలము
వెలగాలి చిరకాలము...
2.హృదయాలు రెండు ముదమార కలిసే
ప్రభు ప్రేమ కాంతిలో
కలగాలి సిరులు నిండాలి ఎదలో
మెండైన వరములు
ఈనాటి ఈ బంధము నిలవాలి కలకాలము
వెలగాలి చిరకాలము...
3.సంసార లోక సంతోష యానం
సాగాలి హాయిగా
ఈనాటి మధుర భావాలు మేర
నిలవాలి సర్వదా
సంతాన సౌభాగ్యము శ్రీయేసు మీకీయగా
శుభ దీవెనలు పొందుడి...