Type Here to Get Search Results !

Nee Chitthamu Sampurthiga Lyrics | నీ చిత్తము సంపూర్తిగా Song Lyrics

Nee Chitthamu Sampurthiga Lyrics | నీ చిత్తము సంపూర్తిగా Song Lyrics

Nee Chitthamu Sampurthiga Lyrics
పల్లవి:
నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా - 2
నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి
నీ ఆలోచనలు - గంభీరమైనవి -2
నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును 2

చరణం: 1
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు - 2
నాయెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు నా ప్రభువా - 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2

చరణం: 2
నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను - 2
నీ కట్టడలను నాకు బోధించి
నీ వాక్యంతో నన్ను నిలుపుము - 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area