Type Here to Get Search Results !

Santhoshamutho ichedi varini lyrics | సంతోషముతో నిచ్చెడు వారిని Song Lyrics | Offering songs in telugu

Santhoshamutho ichedi varini lyrics | సంతోషముతో నిచ్చెడు వారిని Song Lyrics | Offering songs in telugu

Santhoshamutho ichedi varini lyrics
సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||

అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో||

వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||

దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో||

ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో||

భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area