Type Here to Get Search Results !

Putamu vestune vuntivi Song Lyrics | పుటము వేస్తునే ఉంటివి Song Lyrics

Putamu vestune vuntivi Song Lyrics | పుటము వేస్తునే ఉంటివి Song Lyrics

Putamu vestune vuntivi Song Lyrics
పుటము వేస్తునే ఉంటివి నన్ను స్వర్ణకారుడా
ఓర్చుకొనుటకు మంటిని నేను
స్వర్ణము కాదయ్యా
నలగగొడుతునే వుంటివి
నన్ను శిల్పకారుడా
తాలుకొనుటకు మనిషిని నేను
రాతిని కాదయ్యా
|పుటము వేస్తునే |

1) లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు
ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా
పరికించి చూడవా కాలెడి నన్ను స్వర్ణకారుడా
కరుణించి తీయ్యవా కొలిమి నుండి
యేసు నాధుడా
స్వర్ణకారుడా..... యేసు నాధుడా......
|పుటము వేస్తునే |

2) శిలలకు సహితం ఏదో నాటికి విడుదల ఉంది
బ్రతుకు ముగిసే దాక ఎప్పటికీ నెమ్మది లేదా
గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా
దయవుంచి ఆపవా దెబ్బలు నాపై
దయా హ్రుదయుడా
శిల్పకారుడా..... దయాహ్రుదయుడా ......
|పుటము వేస్తునే |

3) కాల్చబడిన బంగారము తుదకు
స్వఛ్ఛత పొందునే
కొట్టబడిన ప్రతి రాయి చివరకు
రూపము నొందునే
శ్రమల కొలిమిలో కాలిన నన్ను శుద్ధిగ మార్చవా
నీదు ప్రేమలో నలిగిన నాకు రూపము నియ్యవా
నను శుద్ధిగ మార్చవా.... నీ రూపమునియ్యవా....
|పుటము వేస్తునే|

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area