Type Here to Get Search Results !

Upavasa Prarthana Lo Lyrics | ఉపవాస ప్రార్ధనలో Song Lyrics - Calvary Songs Lyrics

Upavasa Prarthana Lo Lyrics | ఉపవాస ప్రార్ధనలో Song Lyrics - Calvary Songs Lyrics

Singer Calvary

ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్యా
నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా ||నా ఉపవాస||

మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా యడల నీ చిత్తము (తెలియజేయుము) ||నా ఉపవాస||

దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నూతన దర్శనము (నాకు దయచేయుము) ||నా ఉపవాస||

నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
పాడైన నాబ్రతుకును (బాగుచేయుము) ||నా ఉపవాస||

నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
శోదనపై జయమొందే (కృపను నాకియ్యుము) ||నా ఉపవాస||

ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా దేశప్రజలను (నీవు రక్షించుము) ||నా ఉపవాస||

పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నీ సంఘ స్థాపనకు (నన్ను వాడుము) ||నా ఉపవాస||

యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
కడవరి ఉజ్జీవము (మాపై కుమ్మరించుము) ||నా ఉపవాస||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area