Stotraganam - Edho Aasha Naalo Song Lyrics | స్తోత్రగానం Song Lyrics - ఏదో ఆశ నాలో Lyrics
Singer | Anvwesha |
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమా చూపించినావు
శ్రుతిచేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే
"ఏదో"
1.పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా
"ఏదో"
2.నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2"
ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా
"ఏదో"