పేద నరుని రూపము ధరించి Song Lyrics | Peda naruni rupamu Song Lyrics - Good Friday Song Lyrics
పేద నరుని రూపము ధరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండే
తలవాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరక లేదు
తన్ను ఆధరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను
మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిలా
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విస్వాసముతో