చూచుచున్న దేవుడవు నీవే Song Lyrics | Choochuchunna Devudavu Song Lyrics - Sus. Lillyan christopher Songs Lyrics
పల్లవి:- చూచుచున్న దేవుడవు నీవే
పరిపాలించుచున్న రాజువు నీవే 2
నీవే.. నీవే..నీవే...నీవే..
"చూచుచున్న"
చ:1 అరణ్యములోన దప్పికతో
హగరు నీకై మొఱ్ఱపెట్టియుండగా 2
కన్నీరు చూచిన కరుణామయుడా
నీటి బుగ్గ కలుగజేసి దప్పికను తీర్చి 2 బ్రతికించినావ
"చూచూచున్న"
చ :2 నే ఒంటరినై ఉన్నప్పుడు
పరాక్రమ శాలివై నాకు జయము ఇచ్చితివి 2
బలహీనతలో నన్ను బలపరిచావు
నీ కౌగిటిలో నన్ను హత్తుకున్నా వు 2
"చూచుచున్న"
చ:3 అల్ఫా ఒమేగవై వున్నవాడవు
అనునిత్యము నన్ను కాపాడుచున్నావు 2
నా పాదములకు దీపమై వున్నావు
నీ త్రోవలో నన్ను నడిపించు చున్నావు 2 దరికి చేర్చినావు
"చూచుచున్న"