Gaganam Cheelchukoni Song Lyrics | గగనము చీల్చుకొని Song Lyrics - Dayaa Sankalpam Album Lyrics
Singer | Ps.Freddy Paul |
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా "2"
నిన్ను చూడాలని ( నిన్ను చేరాలని "4")
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది "3"
"గగన"
1.నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది "2"
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను "2"
నీ కౌగిలిలో నేను విశ్రమింతును "2"
"గగన"
2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది "2"
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను "2"
యుగయుగాలు నీతో ఏలెదను "2"
"గగన"
3.నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది "2"
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో "2"
సీయోనులో నీతో నేనుందును "2"
"గగన"