Na Manchi Kapari Song Lyrics | నా మంచి కాపరి Song Lyrics - Latest Christian Songs Lyrics
| Singer | Symonpeter |
నా మంచి కాపరి ప్రభువా నీవై
నాలోన నీ వుండి నడిపించు మార్గమై
నడిపించు మార్గమై (2)
నీవే నాకు ధ్యానమై నీవే నాకు గానమై (2)
నీవే నాకు ప్రాణం యేసయ్యా... (2)
1.
ఈ లోక కష్ట సుఖాలు వదలక వెంటాడిన
కదలని నీ వాడనై నీకై జీవింతును (2)
ఇహలోక ఆశలు మరచి నేనామము ఘనపరచి
నిను పాడి కీర్తించెదను మైమరచి (2)
నీవే నాకు ధ్యానమై నీవే నాకు గానమై (2)
నీవే నాకు ప్రాణం యేసయ్యా... (2)
2.
నీవే లేక ఈ లోకంలో నే నడచు యాత్రలో
సాగదు నా పయణము ఏ దరికైన (2)
గాయపడిన గొర్రెను నేను ఊభిలోన పడియున్నాను
కరుణించి లేవనెత్తి నడిపించుమా (2)
నీవే నాకు ధ్యానమై నీవే నాకు గానమై (2)
నీవే నాకు ప్రాణం యేసయ్యా... (2)
3.
ఈ లోక మనుషులను నమ్ముటకంటే ఇలలో
యేసయ్యా నిన్ను ఆశ్రయించుట మేలు (2)
నాచేయి పట్టి నన్ను నడిచిన నీ స్నేహం
నా భుజము తట్టి నన్ను ఉద్దరించే నీ స్నేహం (2)
నీవే నాకు ధ్యానమై నీవే నాకు గానమై (2)
నీవే నాకు ప్రాణం యేసయ్యా... (2)
