మహిమోన్నతుడు మహిమాన్వితుడు Song Lyrics | మహిమోన్నతుడు మహిమాన్వితుడు Song Lyrics - Dr. John Wesly Songs Lyrics
Singer | Dr. John Wesly |
మహిమోన్నతుడు మహిమాన్వితుడు
మరణము గెలిచిన మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు
అధిక జ్ఞాన సంపన్నుడు
ఆరాధన ఆరాధనా
ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లేలూయా హల్లెలూయ
రాజుల రాజుకే హల్లెలూయ
1) సర్వము నేరిగిన సర్వాధికారి
సర్వము చేసిన సర్యోపకరి //2//
నీతిమంతుని ప్రేమించువాడు
ఇశ్రాయేలును కాపాడువాడు//2//
2) నిత్యము వసియించు అమరుడు ఆయనే
మార్గము సత్యము జీవము అయానే//2//
నమ్మినవారిని రక్షించువాడు
నిత్య జీవము దయచేయువాడు//2//