Langaresinaava Naa Navaku Song Lyrics | లంగరేసినావా నా నావకు Song Lyrics - Sis. Kanthi Kala Songs Lyrics
Singer | Sis. Kanthi Kala |
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు