Type Here to Get Search Results !

Anuragalu kuripinche hosanna song lyrics | అనురాగాలు కురిపించే Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Anuragalu kuripinche hosanna song lyrics | అనురాగాలు కురిపించే Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Singer Ps. John Wesly

అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా

యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ|| అనురాగాలు ||

నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే|| అనురాగాలు ||

అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే|| అనురాగాలు ||

నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు } 2
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే|| అనురాగాలు ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area